ETV Bharat / state

ROADS: 'రహదారులు బాగుచేయండి మహాప్రభో'.. ఇవి.. ఏలూరు ప్రజల ఆర్తనాదాలు

ROADS: రాష్ట్రంలో రోడ్లు ప్రజలను భయపెడుతున్నాయి. గోతులు, గుంతలతో అంతంతమాత్రంగా ఉన్న రోడ్లపై వర్షపు నీటి చేరికతో.. ఎక్కడ జారి పడతామోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక పనిమీద నిత్యం తిరగాల్సిన వారైతే నరకయాతన పడుతున్నారు. ఈ రోడ్లు బాగుచేసి ప్రయాణాలు సాఫీగా సాగేలా చూడండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.

ROADS
ప్రజలను భయపెడుతున్న రోడ్లు
author img

By

Published : Jul 14, 2022, 1:48 PM IST

ప్రజలను భయపెడుతున్న రోడ్లు

ROADS: జూన్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా.. ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అడ్డ రోడ్ల సంగతి అటుంచితే.. కనీసం ప్రధాన రహదారులను కూడా బాగు చేయలేదు. ఏలూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

దేవరపల్లి నుంచి తల్లాడ వెళ్లే జాతీయ రహదారిపై.. నరసన్నపాలెం వద్ద భారీ గోతులు పడ్డాయి. వర్షపు నీరు చేరడంతో కుంటలను తలపిస్తున్నాయి. పెదపాడు మండలం కలవర్రు నుంచి దాసరిగూడెం వరకు ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డు పరిస్థితీ అంతే దారుణంగా ఉంది. వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరు నిలిచి బురదగుంటలా మారుతోంది. ఏలూరు నుంచి ప్రధాన పట్టణాలు కైకలూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు వెళ్లే బైపాస్ రోడ్డు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు.. వర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. ఇలాంటి రోడ్లపై రాకపోకలు సాగించడం నరకప్రాయంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. గుంతల రోడ్లపై తిరగడం వల్ల వాహనాలు దెబ్బతినడంతోపాటు.. మనుషులకూ కూసాలు కదిలిపోతున్నాయని అంటున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.