ETV Bharat / state

పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

ROAD ACCIDENTS IN AP : శ్రీరామనవమి పండుగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ROAD ACCIDENTS IN AP
ROAD ACCIDENTS IN AP
author img

By

Published : Mar 30, 2023, 5:55 PM IST

ROAD ACCIDENTS IN AP : శ్రీరామనవమి పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని సబ్​స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వరావుపేట వైపు వెళుతున్న ద్వి చక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న మామ, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా అత్త తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్​: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామ సమీపాన సీఐ ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. సీఐ ప్రభాకర్ రావు విధులు ముగించుకుని పండ్లూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ ప్రభాకర్​రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని ప్రాథమిక చికిత్స నిమిత్తం నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్య సేవల కోసం చెన్నైకి తరలించారు. నాయుడుపేట ఆసుపత్రిలో సీఐ ప్రభాకర్​రావును సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.

ట్రాక్టర్​ను ఢీకొన్న బైక్​: బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వాడరేవు నుంచి చీరాలకు ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా కుడివైపుకు తిప్పటంతో ట్రాక్టరును ద్విచక్రవాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాగర్ మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదంలో గవినివారిపాలెం నుంచి చీరాలకు ద్విచక్రవాహనంపై వెళుతూ.. అదుపు తప్పి వి.సుబ్బారావు(45) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గూడ్స్​ రైలు ఢీకొని: కడప రైల్వే స్టేషన్ పరిధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి జరిగి 40 రోజులు కూడా కాలేదు.. ఇంతలోనే మృత్యువు రైలు ప్రమాదంలో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణవార్త విని ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలపించారు. కడప శివానందపురానికి చెందిన హరికి 40 రోజులు క్రిందట వివాహమైంది. అతడు ఎర్రగుంటలోని వైద్య విభాగంలో హెల్త్ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు రైల్వేస్టేషన్​కి వచ్చి రైలు ఎక్కి విధులకు వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొంది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వే ఆసుపత్రికి తరలించారు.

మహిళ ఆత్మహత్య: మరోవైపు కడప శివారులోని చౌటుపల్లి రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మ హత్యకు పాల్పడింది. మృతురాలి వయసు 40 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని వెల్లడించారు.

బైక్​ను ఢీ కొన్ని బొలెరో: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవర్గం ఆత్మకూరు మండల పరిధిలోని వడ్డుపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన దంపతులు బోయ రామచంద్ర(52), ముత్యాలక్క(48) ద్విచక్ర వాహనంపై పూలు అమ్ముకోవడానికి అనంతపురం నగరానికి వెళ్తున్న క్రమంలో వడ్డుపల్లి వద్ద బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.