Formula E-Race In Hyderabad : ఫార్ములా- ఈ రేస్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన రేసుల్లో ఇదొకటి. విదేశాల్లో దీని గురించి అధిక శాతం మందికి తెలుసు. మన దేశంలో ఈ రేసుపై పెద్దగా అవగాహన లేదు. ఇది కార్ల రేసు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ) అనే సంస్థ ఈ పోటీని నిర్వహిస్తోంది.
అసలేంటీ ఫార్ములా - ఈ రేసు...? 70 ఏళ్ల క్రితం ఫార్ములా-1 పేరుతో అంతర్జాతీయంగా కార్ రేస్ పోటీలు జరుపుతోంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగేది ఫార్ములా-ఈ రేసు. ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేసింగ్ తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది. మొదటి సారి ఈ రేసు చైనాలోని బీజింగ్‌లో 2014లో జరిపారు. ఇండియాలో ఈ రేసింగ్ జరగడం ఇదే మొదటి సారి. అది కూడా హైదరాబాద్ నగరంలో జరగడం విశేషం. దీనికి ముందు ఫార్ములా-1 రేసు దిల్లీ లో జరిగింది.
ఫార్ములా -1 కి, ఫార్ములా - ఈ రేసుకు తేడా ఏంటి.. ఫార్ములా-1 రేసులో కార్లు పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలతో నడుస్తాయి. అదే ఫార్ములా-ఈ మాత్రం ఎలక్ట్రికల్ కార్లు వినియోగిస్తారు. రెండింటికీ ఇదే ప్రధాన తేడా. ఫార్ములా-1 రేసు కోసం ప్రత్యేక ట్రాక్‌లను తయారు చేస్తారు. దీన్ని సర్య్కూట్ అంటారు. రేస్ జరిగే సమయంలో ఇంజిన్ సమస్యలు, కారు టైర్లను మార్చడానికి ట్రాక్ మధ్యలో అక్కడక్కడ స్టాప్స్ సైతం ఏర్పాటు చేస్తారు. వీటిని మూడు రోజుల పాటు జరుపుతారు.
అదే ఫార్ములా-ఈ రేసు విషయానికి వస్తే.. పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్, డీజీల్ వంటి తరిగిపోయే ఇంధనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం, కాలుష్య నివారణ వంటి విధానంలో భాగంగా వీటిని ప్రారంభించారు. ఈ రేసుల్లో ప్రత్యేకంగా ట్రాక్ వేయక్కర్లేదు. అప్పటికే ఉన్న రోడ్లపై రేస్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసి నిర్వహిస్తారు. వీటిని రెండు రోజుల్లోనే ముగిస్తారు. ఫార్ములా -ఈ రేసులు ఇంతకు ముందు బీజింగ్, దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా... తర్వాత దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో నిర్వహించనున్నారు.
ఈ పోటీలు ఇండియాలో నిర్వహించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. 2011లో దిల్లీలో మొదటి సారి ఫార్ములా-1 రేసు జరిగింది. 2021లో హైదరాబాద్‌లో ఈ రేసు జరపడానికి గట్టి ప్రయత్నమే జరిగింది కానీ సఫలం కాలేదు. 2022 జనవరిలో ఈ రేసు నిర్వాహకులు ఇక్కడకి వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫలితంగా పదమూడేళ్లకు ఫార్ములా -ఈ రేస్ హైదరాబాద్ మహానగరంలో జరగబోతోంది.
ఈ రేస్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ మీదుగా జరుగుతుంది. దీన్ని చూడటానికి వచ్చే వారి కోసం అన్ని ఏర్పట్లూ పూర్తి చేశారు. ప్రజలు చూడటానికి వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు.
ఇవీ చదవండి