ETV Bharat / state

దేశీయ ఇంజినీరింగ్‌ నిపుణులతో సాధ్యం కాదు - ఇంటర్నేషనల్‌ డిజైన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర జలసంఘం - ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం

Central Water Society Decision on Polavaram Project Construction: పోలవరం ప్రాజెక్టులో ఒకే ఒక్క రివర్స్‌ నిర్ణయం ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని మార్చేసింది. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడం దేశీయ ఇంజినీరింగ్‌ నిపుణులతో సాధ్యం కాదని అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం అవసరమని కేంద్ర జల సంఘం తేల్చేసింది.

Central_Water_Society_Decision_on_Polavaram_Project_Construction

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 8:21 AM IST

దేశీయ ఇంజినీరింగ్‌ నిపుణులతో సాధ్యం కాదు - ఇంటర్నేషనల్‌ డిజైన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర జలసంఘం

Central Water Society Decision on Polavaram Project Construction : పోలవరం ప్రాజెక్టులో ఒకే ఒక్క రివర్స్‌ నిర్ణయం ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని మార్చేసింది. సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి పనుల్లో ఉన్న వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. పనులు ఏడాదిన్నరకు పైగా ఆలస్యం చేయడం అనేక ఇంజినీరింగ్‌ సవాళ్లను తెచ్చిపెట్టింది. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడం దేశీయ ఇంజినీరింగ్‌ నిపుణులతో సాధ్యం కాదని అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం అవసరమని కేంద్ర జల సంఘం తేల్చేసింది.

Polavaram Project Construction to International Design Agency : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురువుతున్న సవాళ్లపై ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ఏజెన్సీ (IDA) సహకారం తీసుకోవాలని కేంద్ర జలసంఘం తుది నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆ ఏజెన్సీ ప్రాజెక్టును తరచూ సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లు ప్రతిపాదించాలి. రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటిని కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరులశాఖ, పీపీఏ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాయి. ఇకముందు పోలవరంలో ఇలాగే ముందుకు సాగాలని కేంద్ర జలశక్తి సమావేశంలో నిర్ణయించి, ప్రయత్నాలు ప్రారంభించారు.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

CM Jagan Negligence on Diaphragm Wall : పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ వైఎస్సార్సీపీ పాలనలో నిర్వహణ వైఫల్యం వల్ల ధ్వంసమైంది. దాని స్థానంలో కొత్తది నిర్మించాలని రాష్ట్రం ప్రతిపాదిస్తోంది. దీని వల్ల 600 కోట్ల అదనపు భారం పడొచ్చు. ప్రధాన రాతి, మట్టి కట్ట డ్యాం నిర్మించుకునేందుకు వీలుగా నదీ ప్రవాహం లేకుండా చూసేలా ఏర్పాటు చేసినవే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు. వాటి నిర్మాణం సరిలేక అంచనాలకు మించి సీపేజి వస్తోంది. ఆ నీటితో ప్రధాన డ్యాం నిర్మించుకోవాల్సిన ప్రాంతం నిండిపోతోంది. ఫలితంగా ఆ రెండు డ్యాంలు నిరుపయోగమయ్యాయి. ఆ సీపేజి సమస్యకు పరిష్కారం కనుగొనాలి.

ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులు

Polavaram Project Construction Situation in YSRCP Government : గోదావరిలో బంకమట్టి నేల స్వభావం ఉంది. అక్కడ వైబ్రోస్టోన్‌ కాలమ్స్‌తో ఆ ప్రాంత స్వభావాన్ని మార్చుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. వైబ్రోస్టోన్‌ కాలమ్స్‌ ఒక సీజన్‌లో కొంత నిర్మించి, మరో సీజన్‌లో మరికొంత నిర్మించడంతో పైన కట్టిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. బంకమన్ను రేణువులు మధ్యలో చేరి డ్రైనేజి వ్యవస్థను దెబ్బతీయడంతో గైడ్‌ బండ్‌ కుంగిపోయిందని తేల్చారు. ఇలాంటి నేలల్లో నిర్మాణాలు ఎలా చేపట్టాలో సలహా ఇవ్వాలని కూడా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలసంఘాన్ని కోరారు. అందుకే కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ అంతర్జాతీయ నిపుణుల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు.

'పోలవరం' ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం - రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: అంబటి రాంబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.