ETV Bharat / state

ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు.. సూసైడ్ నోట్​ రాసి చనిపోయాడు.

suicide
ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Mar 20, 2021, 8:57 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారి వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహం వద్దనున్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన చింతపల్లి రాఘవేంద్రగా గుర్తించారు.

"రాఘవేంద్ర గుంటూరులోని ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకుని జెసీబీ కొని, అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ సమయంలో పనులు లేక వాయిదాలు చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు వేధింపులకు గురి చేశారని సూసైడ్ నోట్​లో ఉంది. ఈనెల 17వ తేదీన గుంటూరు నుంచి రావులపాలెం వచ్చిన రాఘవేంద్ర ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. గురువారం రాత్రి గది ఖాళీ చేసి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు" అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండీ.. విజృంభిస్తున్న రౌడీషీటర్లు.. ఆధిపత్య పోరుతో హింసాత్మక నేరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.