తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పిఠాపురంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో... ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరవుతారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే రాలేదు. వైకాపా పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య వేదికపై కూర్చోవాలంటూ... నాయకుల్ని పేరుపేరునా ఆహ్వానించారు. అయితే తమ పేరు పిలవలేదంటూ ఖండవల్లి లోవరాజు.... రామయ్యను నిలదీశారు. వేదిక కింద ఉన్న నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో తోసుకున్నారు. మరికొంత మంది నాయకులు కలగజేసుకొని సర్దిచెప్పారు.
ఇదీచదవండి