ETV Bharat / state

అధికారులపై వైకాపా నేత ఆగ్రహం.. సచివాలయానికి తాళం - వాకతిప్ప సచివాలయానికి తాళం వేసిన వైకాపా నేతలు

ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హుల పేర్లు తొలగించారని వైకాపా రాష్ట్ర కార్యదర్శి చిన్నారావు...అధికారులపై మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా వాకతిప్ప గ్రామ సచివాలయానికి తాళం వేసి, గేటు ముందు బైఠాయించారు. కొందరి నేతల ఒత్తిళ్ల వల్లే అర్హుల జాబితాలో లబ్ధిదారుల పేర్లు తొలగించారని అధికారులతో చిన్నారావు వాగ్వాదానికి దిగారు. అర్హుల జాబితాపై మళ్లీ సర్వే చేయిస్తామని తహసీల్దార్​ హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు.

అధికారులపై వైకాపా నేత ఆగ్రహం.. సచివాలయానికి తాళం

author img

By

Published : Jun 9, 2020, 4:38 PM IST

ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులను తొలగించారంటూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి చిన్నారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామ సచివాలయానికి వైకాపా నేతలు తాళాలు వేసి ఆందోళన చేశారు. గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి రెండు విడతలుగా సర్వే చేసి .. 214 మంది అర్హులని జాబితాను ప్రకటించారని చిన్నారావు తెలిపారు. అయితే మూడో విడత సర్వేలో కేవలం 112 మంది మాత్రమే అర్హులని జాబితా ప్రకటించటంపై ఆయన మండిపడ్డారు. పార్టీలోని కొంతమంది ఒత్తిళ్ల కారణంగానే అర్హుల పేర్లు తీసేశారని ఆరోపించారు.

సీఎం జగన్ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశిస్తే.. అధికారులు లబ్ధిదారుల పేర్లు ఎలా తొలగిస్తారని వైకాపా నేత చిన్నారావు ప్రశ్నించారు. ఈ విషయంపై చిన్నారావు, అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు న్యాయం జరిగేవరకూ కార్యాలయానికి తాళం తీసేది లేదని చిన్నారావు సచివాలయం గేటు ముందు బైఠాయించారు. విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన తహసీల్దార్... ఆందోళనచేస్తున్న వారితో మాట్లాడారు. మళ్లీ సర్వే చేసి అర్హులైన వారందరినీ జాబితాలో చేరుస్తామని హామీ ఇవ్వడంతో వైకాపా నేతలు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి : వాటిని బీఎస్​4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు: రవాణాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.