తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటే... పొడవైన వివేకానందుడి విగ్రహం దర్శనిమిస్తుంది. 100 అడుగుల ఎత్తైన నరేంద్రగిరిపై 53 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఇంత పెద్దదైన నరేంద్రుడి విగ్రహం మరెక్కడా లేదు. ఈ విగ్రహాన్ని రమేష్ రాజు, మరికొందరు 1994లో ఏర్పాటు చేశారు.
నిర్వహణా లోపం
గత కొన్నేళ్లుగా వివేకానందుడి విగ్రహం ఎలాంటి నిర్వహణకు నోచుకోవడం లేదు. నరేంద్రగిరి కొండపైకి వెళ్లే మార్గమంతా తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. మందుబాబులు, పేకాటరాయుళ్లు, అసాంఘిక కార్యక్రమాలకు ఈ విగ్రహ పరిసరాలు అడ్డాగా మారాయి. నరేంద్ర కొండపై గ్రంథాలయమూ ఉంది. వివేకానందుడి జీవిత విశేషాలు, ఆయన అందించిన సందేశాలకు సంబంధించిన పుస్తకాలతో ఈ గ్రంథాలయం నడిచేది. ప్రస్తుతం అదీ మూతపడింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, యువత కోరుతున్నారు.
ఇదీ చూడండి: