తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అడవి గేదెలు హల్చల్ చేశాయి. దేవరపల్లి నుంచి మారేడుమిల్లి వెళ్లే రహదారి, జీఏంవలస, కొండవాడ తదితర గ్రామాలకు వెళ్లే రహదారిలో అడవి గేదెలు సంచరిస్తున్నాయి. అటుగా ప్రయాణించే వాహనదారులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి రక్షణ కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి