నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు మొదటి దశ పనులను ఆయన ప్రారంభించి.. విద్యార్థులకు అంకితం చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పేదవాడికి కార్పొరేట్ స్థాయి చదువులు అందిస్తుందని తెలిపారు.
ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నతమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని మంత్రి విశ్వరూప్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: Kannababu: 'అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులు గుర్తు రాలేదా ?'