తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జోన్నాడలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి కాకినాడకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం అందటంతో విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాశ్ ఆద్వర్యంలో దాడులు నిర్వహించి 17,600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: