తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల నగర పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు జరుగుతున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోవటంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు నగర పంచాయతీ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బందిని విచారించి దస్త్రాలను పరిశీలించారు.
ఇదీ చదవండి
పురిట్లోనే చనిపోయాడని చెప్పి అమ్మేశారు.. తర్వాత ఏమైందంటే...!