ETV Bharat / state

'రావణబ్రహ్మ' వాహనంపై సత్యదేవుడు

అన్నవరం సత్యనారాయణ స్వామి గ్రామోత్సవం వైభవోపేతంగా జరిగింది. పొన్నవాహనం, రావణబ్రహ్మ వాహనాలపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.

author img

By

Published : May 17, 2019, 8:57 AM IST

'రావణబ్రహ్మ' వాహనంపై సత్యదేవుడు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివార్ల గ్రామోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. నూతన వధూవరులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు పొన్నవాహనం, రావణబ్రహ్మ వాహనాలపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. లంకాధిపతి రావణాసురుడు సత్యనారాయణ స్వామికి సేవలు చేస్తాడనీ.. దానికి ప్రతీకగానే రావణ వాహనంపై సత్యదేవుడు ఊరేగుతాడని పండితులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ చదవండి.. ఘనంగా అంకమ్మ, పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_34_16_ravana_ponna_seva_p_v_raju_av_c4_SD. శివుడికి పరమ భక్తుడై... రాముడికి ప్రత్యర్థి అయిన రావణాసురుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన సత్యదేవుని సేవలు అందిస్తాడు అనడానికి ప్రతీకగా రావణ వాహనంపై న, శ్రీకృష్ణుని లీలలు వెనుక ఉన్న ధర్మ సాక్ష్యాలు ప్రతిబింబించే పొన్న వాహనం పైన సత్య దేవుడు, అనంత లక్ష్మీ అమ్మవార్ల ఊరేగడం భక్తులను ఆనందపరవశంలో ముంచెత్తింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గ్రామోత్సవం వేడుకగా జరిగింది. నూతన వధూవరులైన స్వామి అమ్మవార్లను రావణబ్రహ్మ, పొన్న వాహనాలపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. చైర్మన్ ఐ వి రోహిత్, ఈవో సురేష్ బాబులు టెంకాయి కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.