ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - vadapalli venkateshwara swamy latest news

ఏడు శనివారాల నోము సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శనివారం ఒక్కరోజే 43,546 మంది దర్శించుకోగా.. 11 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

Vadapalli Venkateswaraswamy Temple is crowded with devotees
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Mar 14, 2021, 8:22 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్కరోజే 43,546 మంది దర్శించుకున్నారు. ఆలయానికి 11,76,501 లక్షల ఆదాయం సమకూరింది. ఏడు శనివారాల నోము సందర్భంగా... రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

సాధారణ దర్శనం ద్వారా 32,634 మంది, ప్రత్యేక దర్శనం ద్వారా 10,912.... మొత్తం 43,546 మంది భక్తులు బాలాజీని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం రూ.5,45,600, అన్నప్రసాద విరాళం- రూ.2,91,377, స్వామివారి సేవలు- రూ.10,575, లడ్డూ- రూ.3, 00,060, విరాళాలు- రూ.28,889. మొత్తం రూ.11,76,501 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.