తూర్పు గోదావరి జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల్లో విషాదం జరిగింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో 85 ఏళ్ల దంగేటి నాగూరు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేసేందుకు లోనికి వెళ్లగానే కుప్పకూలి పడిపోయారు.
వెంటనే స్పందించి.. ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. మామిడికుదురు మండలం కొమరాడలో కొండయ్య (63) ఓటు వేసిన అనంతరం అకస్మాత్తుగా మరణించాడు. అతని మృతికి గుండెపోటు కారణమని వైద్యులు నిర్థరించారు.
ఇదీ చదవండి: