భగత్‌సింగ్ 113వ జయంతిని పురస్కరించుకొని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఆయన విగ్రహానికి స్థానిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ చరిత్రను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం అన్నారు. జనసేన నేతలు వాసంశెట్టి కుమార్, ఎన్నబత్తుల నాగరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: