ETV Bharat / state

పక్కా వ్యూహంతోనే శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ పక్కా వ్యూహంతోనే అదృశ్యమైనట్లు.. రాజమహేంద్రవరం నార్త్‌ జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రసాద్​ను కాకినాడలోని అచ్చంపేట పోలీసు క్వార్టర్స్‌ అరెస్టు చేసి.. శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.

tonsure case victim prasad has wantedly disappeared with a strategy says dsp venkateshwar rao
పక్కా వ్యూహంతోనే శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం
author img

By

Published : Feb 6, 2021, 7:01 AM IST

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ పక్కాప్రణాళికతోనే అదృశ్యం అయ్యాడని, 24 గంటల్లో దీన్ని ఛేదించామని రాజమహేంద్రవరం నార్త్‌ జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన ఇండుగుమిల్లి ప్రసాద్‌(23) మిత్రులతో కలిసి ఉద్దేశపూర్వకంగానే అదృశ్యమైనట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గందరగోళం సృష్టించి, పోలీసులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని తెలిపారు. ప్రసాద్..‌ చరవాణి, ద్విచక్రవాహనం ఇంటివద్ద వదిలేసి, ఇతరులకు ఏంచెప్పాలనే అంశంపై కుటుంబ సభ్యులకు వివరించాడని తెలిపారు. సీతానగరం మండలం ముగ్గళ్లకు చెందిన బినిపే సందీప్‌ సహాయంతో తొలుత మల్లయ్యపేటలో దాక్కున్నాడని, తర్వాత కాకినాడలోని అచ్చంపేటలో సందీప్‌ బంధువుల ఇంటికి చేరాడని వివరించారు. ప్రసాద్‌, అతని స్నేహితులు తీసుకెళ్లిన ద్విచక్రవాహనం మరమ్మతులకు రావడంతో కాకినాడలోని అచ్చంపేట పోలీసు క్వార్టర్స్‌ వద్ద బాగు చేసుకుంటుండగా అరెస్టు చేసి.. శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.
ప్రసాద్‌ అదృశ్యం అనుమానాలకు తావిస్తోందని, అతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

ఇదీ చదవండి: శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.