తన కూతురు హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ తల్లి కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన లక్ష్మీ అనే మహిళ తన 16 ఏళ్ల కూతురుతో కలిసి చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. చొల్లంగి గ్రామానికి చెందిన డొంక రాజు అనే యువకుడు తన కూతురుకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని తెలిపింది. 50 రోజుల తర్వాత ఈనెల 22న తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని..,డొంక రాజే తన కుతూరుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె ఆరోపిస్తుంది.
రాజుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని...ఆ మహిళతో పాటు చంటి అనే వ్యక్తితో కలిసి రాజు తన కూమార్తెను పొట్టనపెట్టుకున్నాడని వాపోయింది. పోలీసులు తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది.
ఇదీచదవండి