తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి... యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారావు ఫౌండర్‌గా నడపుతున్న వృద్ధాశ్రమం, అనాథ బాలల ఆనంద నిలయం, బ్లడ్ బ్యాంక్, బేబీ కేర్ సెంటర్లను సందర్శించారు. నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఉచితంగా అందిస్తున్న సేవలకు సహకరిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండీ: