మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దేవిచౌక్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి: అచ్చెన్నాయుడి అరెస్ట్ కక్షసాధింపే: రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే