ETV Bharat / state

కాకినాడ నగరాన్ని ముంపు సిటీగా మార్చేశారు : తెదేపా - వరద ముంపులో కాకినాడ నగరం వార్తలు

వైకాపా ప్రభుత్వం స్మార్ట్​ సిటీ కాకినాడను ముంపు ప్రాంతంగా మార్చిందని తెదేపా నేతలు విమర్శించారు. కాకినాడ దుమ్ములపేట, సంజయ్ నగర్​లో పర్యటించిన ఆ పార్టీ నేతలు ప్రజలతో మాట్లాడారు. నగరానికి రక్షణ కవచంలా ఉన్న మడ అడవులను నరికివేయడం వల్ల వరద నీరు నగరంలోకి వచ్చిందన్నారు.

kakinada tdp
kakinada tdp
author img

By

Published : Oct 17, 2020, 4:10 PM IST

వైకాపా పాలనలో స్మార్ట్ సిటీ కాకినాడ ముంపు నగరంగా మారిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వనమాడి కొండబాబు ఆరోపించారు. ఏలేరు వరద ఓ వైపు, సముద్ర జలాలు మరోవైపు కాకినాడ నగరాన్ని ముంచెత్తాయన్నారు. రక్షణ కవచంలా ఉన్న మడ అడవుల్ని నరికేయడం వల్లే వరద నీరు నగరంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు దుమ్ములపేట, సంజయ్ నగర్​లో పర్యటించారు.

ముంపు బాధితులు తాము పడుతున్న ఇబ్బందుల్ని తెదేపా నాయకుల వద్ద ఏకరవు పెట్టారు. ఇళ్ల స్థలాల పేరిట మడ అడవుల్ని నరకి వేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ముంపు బాధితుల్ని ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.