తూర్పుగోదావరి జిల్లా మండపేట ఆరో వార్డులో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి కాశిన కాశీవిశ్వనాథంను గెలిపించాలని కోరుతూ... ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఛైర్ పర్సన్ అభ్యర్థి గడి సత్యవతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనరల్ ఫండ్‌ను ప్రజా అవసరాలకు వినియోగించే హక్కు కౌన్సిలర్‌కు ఉంటుందని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. కౌన్సిలర్ అభ్యర్థి కాశీవిశ్వనాథంను గెలిపిస్తే గొల్లపుంత కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని అన్నారు.
ఇదీచదవండి.