ఇదీ చదవండి :
అమరావతికి మద్దతుగా ప్రత్తిపాడులో బైక్ ర్యాలీ... - ప్రత్తిపాడులో టీడీపీ బైక్ ర్యాలీ
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు సేవ్ అమరావతి పేరిట ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రత్తిపాడు నుంచి ఎర్రవరం వరకు 600 ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేశారు. బైక్ ర్యాలీలో తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా పాల్గొన్నారు. అనంతరం ఎర్రవరంలో అమరావతినే రాజధానిగా కొనసాంచాలని ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.
సేవ్ అమరావతి పేరిట ప్రత్తిపాడులో బైక్ ర్యాలీ
రాజధానిగా అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రజా బ్యాలెట్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి ఇంటి వద్ద కూడా 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని విమర్శించారు. ప్రజాబ్యాలెట్ నిర్వహణకు ముందు.. ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వరుపుల రాజా, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 600 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు నుండి ఎర్ర వరకు కొనసాగిన బైక్ ర్యాలీలో తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.
ఇదీ చదవండి :
Last Updated : Jan 17, 2020, 6:53 PM IST