సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి వ్రతమాచరించిన అనంతరం స్వామిని దర్శించుకుని పూజలాచరించారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
ఇదీ చదవండి: