బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - kakinada rangaraya medical college
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని వసతి గృహం భవనం పైనుంచి దూకింది. ఇది గమనించిన వసతిగృహ సిబ్బంది, తోటి విద్యార్ధులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.