కాలేజీ యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ జీవితాలు ప్రశ్నార్థంగా మారాయని కాకినాడలో డీఎడ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సెప్టెంబరు 28 నుంచి జరుగుతున్న డీఎడ్ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 30ని రద్దు చేసి భవిష్యత్తులో అందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్ధులను బలిచేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. డీఎడ్లో 2018-20 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్, స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్ధులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది జీవితాలు అందకారంలోకి వెళ్లాయన్నారు.
ఇదీ చూడండి: