MEMU Car Shed: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్స్-మెమూ రైళ్ల నిర్వహణంతా రాజమహేంద్రవరం కేంద్రంగానే జరుగుతుంది. ఇక్కడున్న మెమూ కార్‌షెడ్‌లోనే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు, సికింద్రాబాద్, చెన్నై డివిజన్లకు చెందిన మెమూ రైళ్లను మెయింటైన్ చేస్తారు. 30 రైళ్లు, 195 కోచ్‌ల నిర్వహణ పకడ్బందీగా జరుగుతుంది. రోజూ 2 వందలకు పైగా సిబ్బంది.. 24 కోచ్‌లకు మరమ్మతులు చేసి వీటిని పరిశీలిస్తారు. బ్రేక్‌లు, ట్రాక్షన్, భద్రత, లైట్లు, ఫ్యాన్లను పరీక్షిస్తారు. అలాగే శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాషింగ్ ప్లాంటులో.. రైళ్లు, బోగీలను కడుగుతారు.
1999లో ప్రారంభమైన ఈ మెమూ కార్ షెడ్‌లో కోచ్‌ని 30టన్నుల క్రేన్‌తో లిఫ్ట్ చేసి పర్యవేక్షణ చేసే సదుపాయం ఉంది. అలాగే పొడవైన 360 మీటర్ల పిట్ పై రైలుని నిలిపి సిబ్బంది క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు. ట్రిప్ షెడ్యూలు, ఐఏ, ఐసీ, టీవోహెచ్.. ఇలా రైలుని అన్ని విభాగాల సిబ్బంది పరిశీలించిన తర్వాతే ప్రయాణికుల సేవకు పంపిస్తారు. ఒక్కో రైలు వారంపాటు ప్రయాణికుల్ని గమ్య స్థానాలు చేర్చేందుకు వినియోగిస్తారు. అవి తిరిగి మెమూ కార్ షెడ్‌కు వచ్చిన తర్వాత మరమ్మతులు చేస్తారు. కోచ్ దిశను మార్చేందుకు వీలుగా ఈ కేంద్రంలో టర్న్ టేబుల్ ఉంది. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుందని సిబ్బంది తెలిపారు.
రాజమహేంద్రవరంలోని మెమూ కార్ షెడ్ నిరంతరాయ సేవలకు ప్రతిష్ఠాత్మక నాణ్యతా పత్రాలు దక్కాయి. వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ 55, ఐఎస్‌వో 9001, ఐఎస్‌వో 45001 పత్రాలు ఈ కార్‌షెడ్ అందుకుంది.
ఇదీ చదవండి:
జగన్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు.. "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసిన తెదేపా