తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో.. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి.నాగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ సూపరింటెండెంట్ అందజేశారు.
వెంట వచ్చిన వైకాపా నేతలతో నాగిరెడ్డి మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. అంతర్వేదిలోని 14 ఎకరాల చెరువును ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోకి తీసుకుని.. ఆధునీకరణ చేయాలని స్థానికులు కోరారు. సాగు, తాగునీటికి సఖినేటిపల్లి మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: