ETV Bharat / state

నిబంధనలు పాటించని వాహనాలపై పోలీసుల స్పెషల్​ డ్రైవ్​

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పోలీసులు.. స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలపై అపరాధ రుసుము వసూలు చేసినట్లు అమలాపురం డీఎస్పీ తెలిపారు.

Special police drive
పోలీసుల స్పెషల్​ డ్రైవ్​
author img

By

Published : Mar 23, 2021, 8:23 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వాహనాలపై పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, స్థానిక సీఐ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్​ జరిగింది. నిబంధనలు పాటించని వాహనాలపై అపరాధ రుసుము విధించి.. వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంబర్​ ప్లేట్ సరిగా లేని, వాహన పరిమితికి మించి ప్రయాణించటం, లైసెన్స్​ లేకపోవటం, ఇతర నిబంధనలు పాటించని వాహనాలపై జరిమానా విధించినట్లు చెప్పారు. ఒక్కరోజు వసూళ్లు రూ.12లక్షలు పైచిలుకు అని వెల్లడించారు. ఈ డ్రైవ్​లో పది మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో సెల్ టవర్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.