ETV Bharat / state

పట్టించినా.. పట్టించుకోరా...? - తూర్పు గోదావరి జిల్లాలో మట్టి తవ్వకాల తాజా వార్తలు

మట్టి అక్రమ తవ్వకాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేటాయించిన భూములను మెరక చేసేందుకు గౌతమి వంతెన సమీపంలోని బొండు మట్టిని తవ్వి తరలిస్తున్నారు. గమనించిన తెదేపా నేతలు పోలీసులకు పట్టించినప్పటికీ లారీలు వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

soil illegal excavation
మట్టి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తెదేపా నేతలు
author img

By

Published : Jun 17, 2020, 11:38 AM IST

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో కేటాయించిన భూములను మెరక చేసేందుకు స్థానిక గౌతమి వంతెన సమీపంలోనే బొండు మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మట్టి తరలిస్తున్న లారీలు దేవరపల్లికి కాకుండా ఆలమూరు వైపు వెళ్తుంటే రెండు లారీలను తెదేపా నాయకులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు ఎలాంటి కేసులు లేకుండా తిరిగి వదిలేయడంపై సీఐ వి.కృష్ణ, ఎస్సై బుజ్జి బాబులను తెదేపా నేతలు ప్రశ్నించారు. లారీలకు అనుమతులు ఉన్నాయని, అందుకే విడిచి పెట్టామన్నారు. కొవిడ్ సమయంలో పదుల సంఖ్యలో స్టేషన్​కు రావడం ఏంటని, కేసులు పెడతామని పోలీసులు అనడం తెదేపా నాయకులు, కార్యకర్తలు స్టేషన్​ బయటకు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణ స్టేషన్​కు చేరుకొని మట్టిని అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని, తాము పట్టించిన లారీలను సైతం విడిచి పెట్టారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలకు వత్తాసు పలకడం దారుణమని, నిలువరించకపోతే ఉద్యమం చేపడతామని తెదేపా నేతలు హెచ్చరించారు.

ఇవీ చూడండి...: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.