ETV Bharat / state

CM JAGAN: సీఎం సభలో షార్ట్​ సర్క్యూట్​.. చెలరేగిన మంట - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు చేసిన ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వెలుపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ జరగడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.

సీఎం సభలో షార్ట్​ సర్కూట్
సీఎం సభలో షార్ట్​ సర్కూట్
author img

By

Published : Aug 16, 2021, 10:55 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వెలుపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ జరగడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సభా వేదిక నిండా జనం ఉన్నారు. సీఎం సభా వేదిక వెలుపల నాడు - నేడు పనులను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభకు అత్యంత సమీపంలో వెలుపల జనరేటర్ సంబంధించి కేబుల్ వైర్లు నుంచి మంటలు ఏర్పడ్డాయి.

దీంతో అగ్నిమాపక సిబ్బంది ట్రాన్స్​కో అధికారులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. సభలో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించి విద్యుత్ పునరుద్దరించారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ కే.సంతోష్ రావు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన జనరేటర్​కు సంబంధించినదని, దీనిపై విచారణ చేస్తామని ట్రాన్స్​కో అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ramya murder case: రణరంగంగా మారిన గుంటూరు... పరామర్శకు వెళ్లిన తెదేపా నేతలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.