ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. పనులను నాణ్యతతో చేయాలని ఆయన అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. అడ్డతీగల మండలంలో వీరవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన మనబడి నాడు-నేడు పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పాత మరుగుదొడ్లకు రిపేర్లు చేయించకుండా కొత్త వాటిని ఎందుకు ప్రతిపాదించారని ప్రధానోపాధ్యాయులపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, స్థలాల లెవెలింగ్ పనులు, ఆట స్థలం అభివృద్ధి, మొక్కల పెంపకంపైనా దృష్టి సారించాలని, ఈనెలాఖరు నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేసి పాఠశాలలు పునః ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని అన్నారు.
అనంతరం డి. రామవరం గ్రామంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. డ్యామ్ పరిశీలనకు వాటర్ షెడ్ సిబ్బంది హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పీవో వెంట పంచాయతీరాజ్ ఏఈ రవితేజ తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి: ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్