తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్సీ, ఎస్టీ( SC-ST) బ్యాక్ లాగ్ ఉద్యోగ అభ్యర్థులు నిరసకు దిగారు. అనర్హులైన అభ్యర్థులతో పోస్టులు భర్తీ చేస్తున్నారంటూ.. స్పందన హాలు వద్ద ఆందోళన చేపట్టారు. 2018లో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి ఇవాళ అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువీకరణ నిర్వహిస్తున్నారు. దీని కోసం ఉద్యోగార్ధులు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. అప్పటి జాబితాలో ముందు వరుసలో ఉన్న తమ పేర్లను తప్పించి అనర్హులకు చోటు కల్పించారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీకి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని.. తీరా భర్తీ ప్రక్రియలో తమకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
"2018లో చేసిన పోస్టులో నాది 51వ స్థానం. 2021లో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాం. నాది లిస్టులో 51 పేరు, అయితే ఇప్పుడు 61వ స్థానం వారి వరకు పిలిచారు. నన్ను పిలవలేదు. డబ్బులు తీసుకుని పోస్టులు అమ్ముకుంటున్నారా?" -ఓ ఉద్యోగార్థి
ఇదీ చదవండి: APGEA Secretary: 'సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతాం'