తూర్పు గోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయర్ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కాకినాడ స్పెషల్ పార్టీ సిబ్బంది సారా బట్టీల పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరివీడు పంచాయతీ పరిధిలోని కంబాల పాలెం, ఏలేరు రిజర్వాయర్ ఎగువ ప్రాంతాల్లో కొండల మాటున బట్టీలను గుర్తుంచారు.
సారా తయారీకి సిద్దంగా ఉంచిన 18వేల లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. దాడుల్లో 200 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.