రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగం ఎండీ గోపాలకృష్ణన్‌కు కరోనా సోకినట్లు.. జైలు సూపరింటెండెంట్ తెలిపారు. గోపాలకృష్ణన్‌కు సోమవారం రాత్రి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుత్రిలో చికిత్స అందిస్తున్న స్పష్టం చేశారు.
ఇవాళ గురునాథం, ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించి.. కాకినాడ ల్యాబ్‌కు పంపినట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఫలితాలు రేపు ఉదయం వస్తాయన్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
గోపాలకృష్ణన్‌ను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలి
కరోనా బారిన పడిన గోపాలకృష్ణన్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ..ఆయన కుటుంబ సభ్యులు అనిశా కోర్టును ఆశ్రయించారు. ఆయనను కార్పోరేటు ఆసుపత్రికి తరలించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా...కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు.
ఇదీ చదవండి: