తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను జాయింట్ టాస్క్ఫోర్స్ బృందం సీజ్ చేసింది. టాస్క్ఫోర్స్ డీఎస్పీ కృష్ణకిషోర్ వివరాలు తెలియజేశారు. జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. గోపాలపురం రీచ్ నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇసుక లోడుతో వస్తున్న 3 లారీలు, తరలించడానికి సిద్ధంగా ఉన్న మరో 29 లారీలు, 3 ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. అమలాపురం ఆర్టీవో ఇళ్ల స్థలాల కోసం బొండు ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారని.., అయితే, అనుమతి ఉన్న ప్రాంతంలో కాకుండా నదీగర్భంలో ఇసుక తవ్వుతున్నందున వాహనాలను సీజ్ చేశామని డీఎస్పీ చెప్పారు.
ఇవీ చదవండి... గుంటూరులో రెండు అనుమానిత కరోనా కేసులు