లాక్‌డౌన్ భారం నుంచి ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని తీసుకునేందుకు బ్యాంకుల వద్ద జన్‌ధన్ ఖాతాదారులు క్యూలు కట్టారు. జన్‌ధన్ ఖాతాల్లో 500 రూపాయలు, పీఎం కిసాన్ యోజన ఖాతాల్లో 2 వేల రూపాయలను కేంద్రం జమ చేసింది. మూడు రోజుల సెలవుల తరువాత బ్యాంకులు తెరవటంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ఉదయం నుంచి ఖాతాదారులు క్యూ కట్టారు. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భౌతిక దూరం కోసం వేసిన సర్కిల్స్‌లో చెప్పులు ఉంచి తమవంతు వచ్చినపుడు వాటిని ధరించి వెళ్తున్నారు. వృద్ధులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా: రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు అంటే ఏమిటీ..?