ఏ నిమిషానికి ఏమి ఊడునో అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు దుస్థితి. ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి... తరచూ బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి.తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ పై ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బంపర్ ఊడిపడింది. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెళ్తుండగా బంపర్ ఊడిపడి పెద్ద శబ్దం రావడంతో బస్సులోని ప్రయాణికులు ఏమైందో తెలియక భయాందోళనకు గురయ్యారు. బస్సు ఆపిన ఆర్టీసి సిబ్బంది వెంటనే బంపర్‌ను బస్సులో వేసుకుని వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: Suicide Attempt: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం.. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా?