తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో నలుగురు వ్యక్తులు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో అన్నదమ్ములు ఉండగా.. అన్న మృతి చెందాడు. తమ్ముడుకి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనవారు అమలాపురం సమీపంలోని అమ్మాజీపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పవన్, శివల మృతదేహాలను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...