తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు లంక గ్రామంలో బుధవారం అరుదైన పక్షి అబ్బురపరిచింది. స్థానికంగా ఉన్న ఓ చెరువు వద్ద గ్రామస్థులు పక్షిని గుర్తించారు. అది వింత ఆకారంతో సుమారు 14 అంగుళాల పొడవైన ముక్కును కలిగి ఉంది. భారీ రెక్కలతో వింతగా ఉన్న పక్షిని చూసేందుకు గ్రామస్థులు పోటీపడ్డారు. దీనిపై కోరంగి వన్యప్రాణుల విభాగ బయాలజిస్ట్ మహేశ్‌ను 'ఈటీవీ భారత్' ప్రతినిధి వివరణ కోరగా.. పక్షి పేరు స్పాట్ బిల్డ్ పెలికాన్ అని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని కొల్లేరు పక్షి సంరక్షణా కేంద్రంలో ఇటీవల వీటి సంరక్షణ, పిల్లల ఉత్త్పత్తికి సంబంధించి ఏర్పాట్లు చేశారన్నారు. ఇవి ఎక్కువగా మలేషియా, శ్రీలంక దేశాల్లోని లంక ప్రాంతాల్లో ఉంటాయని విహారంలో భాగంగా ఇటుగా వచ్చి ఉంటుందన్నారు.
ఇదీ చదుండి: పబ్జీకి బానిసైన విద్యార్థి.. తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని సూసైడ్