ETV Bharat / state

భద్రాద్రి రాముని కల్యాణానికి భక్తుల గోటి తలంబ్రాలు సమర్పణ

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 21న జరగనున్న సీతారాముల కల్యాణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. అన్నదానం నిమిత్తం 50 కిలోల బియ్యం, బంగారు ఆభరణాలు స్వామివారి ఆలయంలో అందించారు.

devotees offering for sriramanavami to lord rama
భద్రాద్రి రాముని కల్యాణానికి భక్తుల గోటి తలంబ్రాలు సమర్పణ
author img

By

Published : Apr 19, 2021, 9:16 PM IST

భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు గోటి తలంబ్రాలు సమర్పించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని సుమారు యాభై మండలాలకు చెందిన భక్తులు సమర్పించిన గోటి తలంబ్రాలను రామయ్య సన్నిధిలో అందించారు.

గత ఐదేళ్ల నుంచి స్వామివారికి... రాజమహేంద్రవరానికి చెందిన శ్రీనివాస్​, దేవి దంపతులు గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది తలంబ్రాలతో పాటు, అన్నదానం నిమిత్తం 50 కిలోల బియ్యం, రూ.60వేలు విలువైన బంగారు ఆభరణం స్వామివారికి సమర్పించారు.

ఇదీ చూడండి:

ఇంజన్లో మంటలు చెలరేగి వాహనం దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.