తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఇస్కాన్ పేరు చెప్పి విరాళాలు సేకరిస్తున్నారని, అటువంటి వ్యక్తులకు, తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని..ఈ విషయాన్ని దాతలు గ్రహించాలని రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ అన్నారు. కోనసీమలోని అమలాపురంలో తప్ప మరి ఎక్కడా కూడా తమ శాఖ లేదని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. త్వరలోనే కోనసీమ ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇవీ చదవండి...కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వోద్యోగులకు ఇకనుంచి వంతులవారీగా పని