గోదావరి వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని రైల్వే లైను నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. సుమారు 2 వేల కోట్ల రూపాయల నిధులతో కోనసీమ రైల్వే లైన్ పనులు మొదలుపెట్టి రెండు సంవత్సరాలు కావొస్తోంది. గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నది పాయలపై 3 రైలు వంతెనలు నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
అయితే.. భారీ స్థాయిలో గోదావరికి వరదలు వస్తుండటంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. యంత్ర సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వరదలు పూర్తి స్థాయిలో తగ్గితేనే పనులు మొదలుపెట్టేందుకు వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: