తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం కోట గ్రామం వద్ద జరిగిన కారు ప్రమాదంలో విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. ఓదార్చారు. ప్రమాదం విషయాలు తెలుసుకున్నారు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ప్రమాదంలో విజయలక్ష్మి, ఆమె భర్త, చిన్న కుమారుడు మృతి చెందారు.
30 ఏళ్లుగా పుదుచ్చేరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పాటు, తెలుగు అధ్యాపకురాలిగా, కవయిత్రిగా విజయలక్ష్మి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆమె కృషికి పుదుచ్చేరి ప్రభుత్వం తెలుగు రత్న బిరుదుతో సత్కరించిందని చెప్పారు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం యానాం చరిత్రను వివరిస్తూ పాడిన పాటకు అక్షర క్రమం చేసింది విజయలక్ష్మేనని చెప్పారు. ఆమె మరణం సాహితీలోకానికి తీరని లోటన్నారు.
ఇదీ చదవండి: