తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గ్రామీణ పోలీసు స్టేషన్లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోలీసు స్టేషన్లోనే బూతులు తిట్టుకుని కొట్టుకున్నారు. ఓ కేసు వివారాలు సేకరించే క్రమంలో వారిద్దరూ గొడపడి కొట్టుకున్నారు.
రైటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జనార్దనరావును ఒక కేసు వివరాలు పెన్‌డ్రైవ్‌లో లోడ్ చేసి, ప్రింట్ తీసి ఇవ్వాలని ఏఎస్సై తిరుమలరావు ఆదేశించారు. పెన్‌డ్రైవ్‌లో వైరస్ ఉందని, సమాచారం లోడ్ చేసి ప్రింట్ తీయడం ఆలస్యమవుతుందని జనార్దనరావు సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరి మద్య వాదన మొదలైంది. ఎస్సై పక్క గదిలోనే ఉన్నా వీరిద్దరు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఏఎస్సై చెవిపైన, హెడ్ కానిస్టేబుల్‌కు ఛాతీపైన స్వల్ప గాయాలయ్యాయి.
వారిని వారించి జరిగిన విషయాన్ని ఎస్సై జగన్మోహనరావు సీఐ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఇద్దరిపైనా కేసు నమోదు చేసి ఎస్పీకి రిపోర్టు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ఇద్దరిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: