'కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్.' ఇదీ ఓ చిత్రంలో పోలీస్ విధి నిర్వహణపై నటుడు చెప్పే డైలాగ్. విధులకు చిహ్నంగా భావించే పోలీస్ టోపీ అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చెత్త కుప్పలో దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. సమీపంలోనే రూరల్ పోలీస్స్టేషన్ ఉండడం గమనార్హం. విషయాన్ని రూరల్ ఎస్సై రాజేష్ వద్ద ప్రస్తావించగా టోపీ వెంటనే అక్కడ్నుంచి తీయిస్తామన్నారు.
ఇదీ చదవండి: