పోలవరం నిర్మాణం నిర్దేశించుకున్న సమయంలోపు పూర్తవుతుందని ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్.... అశాభావం వ్యక్తం చేశారు. పోలవరంలో పర్యటించిన ఆయన..... నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్ వే, కాఫర్ డ్యాం పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాలో నిర్వాసితుల సమస్యలు సోమవారం పరిశీలిస్తామని అయ్యర్ చెప్పారు. .
తూర్పు గోదావరి జిల్లా అంగుళూరులో పోలవరం కాఫర్ డ్యాంలను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం పరిశీలించింది. ప్రాజెక్ట్ కు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా వైపు గ్యాప్ 1 ప్రాంతాన్ని అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, విద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతాల్ని E.C.R.F. పనుల్ని తనిఖీ చేశారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను ఇంజనీర్లు వివరించారు.
ఇదీ చదవండి: 'దివిస్'పై ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోంది : యనమల