ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... 23 గ్రామాలకు శాపం

అధికారుల అడ్డగోలు సర్వేకి ప్రజలు బలయ్యారు. పోలవరం ప్రాజెక్టు సర్వేలో జరిగిన తప్పిదంతో.. సర్వస్వాన్ని కోల్పోతున్నారు. 23 గ్రామాల ప్రజలు.. ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయానికి అర్హత ఉన్నా... నోచుకోలేకపోతున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 2:01 PM IST

పోలవరం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి... ముంపు గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అయినా... వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ముంపు గ్రామాల గుర్తింపుతో పాటు.. ఆర్థిక సహాయాల్లో.. అధికారుల నిర్లక్ష్యమే వారికి శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల గుర్తింపు... అశాస్త్రీయంగా జరగడమే ఈ పరిస్థితికి కారణమైంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో విలీన మండలాలైన కుక్కునీరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో 23 గ్రామాలను.. అధికారులు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో చేర్చలేదు. గోదావరికి వరద వస్తే చాలు... ఈ గ్రామాలు నీటమునుగుతాయి. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాల జాబితాలో లేకపోవడం విచిత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. ఈ 23 గ్రామాలు నీటిగర్భంలోకి జారుకొంటాయి. గోదావరికి 60 అడుగుల వరద వస్తేనే ఈ గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో నీటమునుగుతాయి. అలాంటి గ్రామాలను ముంపు గ్రామాల్లో చేర్చకపోవడం.. తమను తీవ్రంగా నష్టపరుస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఈ 23 గ్రామాలను పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా గుర్తిస్తేనే... నిర్వాసితులుగా ఆర్థిక సహాయాలు అందుతాయి. గిరిజనులకైతే.. భూమికి భూమి, ఇల్లు, భూ పరిహారం, ఆర్​ఆర్​ ప్యాకేజీ వంటివి అందుతాయి. గిరిజనేతరులకు భూమికి భూమి మినహా మిగితా ఆర్థిక సహాయాలు అందిస్తారు. నిర్వాసితల జాబితాలో లేకపోవడం వల్ల,ఈ గ్రామాలకు పునరావాస కార్యక్రమాలు అధికారులు ఇప్పటివరకు చేపట్టలేదు. గోదావరిలో నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం నదీ పరివాహక గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో.. ఈ గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సి వస్తోంది. అధికారులు పునరావాసం చూపించని పరిస్థితుల్లో.. ఎక్కడికి వెళ్లాలో తెలియని ప్రశ్నార్థకస్థితిని ఈ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను శాటిలైట్ ద్వారా అధికారులు గుర్తించారు. శాటిలైట్ గుర్తించని గ్రామాలను మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. కాంటూరు పరిధిలో అధికారులు ఇచ్చిన జాబితా... తప్పులతడక అని గతంలో పలు సర్వేలు తేల్చాయి. ఇప్పుడు ఈ 23 గ్రామాల ప్రజల బాధలు.. సర్వేల ఫలితాలు నిజమే అని నిరూపిస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని వివరణ కోరగా.. గతంలో చేసిన సర్వేల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని అంగీకరించారు. తిరిగి పరిశీలిస్తామని చెప్పారు. తమ ప్రాంతాల్లో మరోసారి సర్వే నిర్వహించి.. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల జాబితాలో చేర్చాలని బాధితులు కోరుతున్నారు.

ముంపుగ్రామాల జాబితాలో తమ గ్రామాలను చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఇదీ చూడండి కర్​నాటకీయంలో ఆఖరి అంకం నేడేనా!

Intro:ap_rjy_61_19_grama volunteers_interviews_10022

Body:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కు ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది..ఎంపీడీవో తహసీల్దార్ meo లు ఆధ్వర్యంలో ఈ ముఖాముఖి కొనసాగుతోంది.. వాలంటీర్ ఉద్యోగం నకు డిగ్రీ అభ్యర్థులు సైతం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు..చాలా మంది అభ్యర్థులు కనీసం ప్రభుత్వ పథకాలు పై కూడా అవగాహన లేకుండా ఉన్నారు..మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకొన్నారు..ప్రతీ రోజు 200 మందికి పైగా అభ్యర్థులు ను అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారు..అభ్యర్థులు లో సేవా దృక్పధం ఎంతవరకు ఉందొ ఈ ఇంటర్వ్యూ లలో అధికారులు పరిశీలిస్తున్నారు... శ్రీనివాసరావు ప్రత్తిపాడు 617 ...ap10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.