ETV Bharat / state

'అన్యాయాన్ని ప్రశ్నిస్తే కొడతారా..ఎస్సైపై చర్యలు తీసుకోండి'

అక్రమ ఆక్వా చెరువులపై ప్రశ్నించిన వ్యక్తిని ఎస్సై విచక్షణారహింతగా చితకబాదాడంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసు స్టేషన్ ఎదుట దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.

people protest at sakinetipally police station against si
అన్యాయాన్ని ప్రశ్నిస్తే కొడతారా..ఎస్సైపై చర్యలు తీసుకోండి
author img

By

Published : Apr 25, 2021, 9:47 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసు స్టేషన్ ఎదుట దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. అంతర్వేదిలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులపై ప్రశ్నించినందుకు కొల్లాబత్తుల రాంబాబు అనే వ్యక్తిని స్థానిక ఎస్సై విచక్షణారహింతగా చితకబాదారని, పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసారు.

గత కొంత కాలంగా అంతర్వేది తీరంలో పర్యవరణానికి హాని కలిగించేలా కొందరు అక్రమంగా ఆక్వా సాగు చేస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమంగా చెరువులు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.., ప్రశ్నించిన వారిని స్టేషన్​కు తరలించి చితకబాదటం సరైంది కాదని వాపోయారు. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రాజోలు సీఐ సఖినేటిపల్లి స్టేషన్​కు చేరుకొని దళిత సంఘాల నేతలతో చర్చించారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని.., అక్రమ చెరువుల విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇవ్వటంతో వారు నిరసన విరమించారు.

ఇదీచదవండి: కరోనా: అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.