తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో బస్సు సేవలు నిలిచిపోయాయి. నిత్యం వేలాది మంది ఈ డిపో నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రదేశాలకు రోజుకు 102 సర్వీసులు తిరుగుతాయి. అన్నీ ఒకేసారి నిలిచిపోయిన కారణంగా.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు.
ఇదీ చదవండి: